స్టార్ హీరోయిన్ తమన్నాపై పోలీసు కేసు.. తెరవెనుక బడా బాబులు

తెలిసి చేసినా తెలియకుండా చేసినా తప్పు తప్పే.  అందుకు తగ్గ  శిక్ష కూడా అనుభవించాల్సిందే. పైగా సినిమా హీరోయిన్ అని చెప్పి  డిస్కౌంట్ ఏమి ఉండదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ప్రముఖ నటి తమన్నా(Tamannaah)కి ఒక పెద్ద చిక్కొచ్చి పడింది. అదంతా ఆమె చేసుకున్నదే. మ్యాటర్ ఏంటో చూద్దాం

2023 ఇండియన్ క్రికెట్ ప్రీమియర్ లీగ్  ప్రత్యక్ష ప్రసార హక్కులని  వయాకామ్ దక్కించుకుంది. అంటే ఐపిఎల్ మ్యాచ్ లన్ని వారి నుంచే ప్రసారం కావాలి. కానీ  ఫెయిర్ ప్లే(fair play)అనే  యాప్ లో కూడా ప్రత్యక్ష ప్రసారం అయ్యింది. ఈ యాప్ ని  తమన్నా ప్రమోట్ చేసింది. అంటే ప్రచారకర్తగా ఉంది. ఇప్పుడు ఈ విషయం మీదే  తమన్నా మీద కేసు నమోదు అయ్యింది. తమన్నా ప్రచారం చెయ్యడం వల్లే  కోట్ల రూపాయిల నష్టం వాటిల్లిందని వయాకామ్ ఆరోపిస్తుంది.మహారాష్ట్ర పోలీసులు తమన్నాకి సమన్లు కూడా  పంపించారు. ఈ నెల 29 న ఆమె  విచారణకి హాజరవ్వాలి. ఇదే  కేసులో సంజయ్ దత్  కూడా కొన్ని రోజుల క్రితం సమన్లు అందుకున్నాడు.  23 న విచారణకి హాజరు కావాల్సి ఉండగా హాజరు కాలేదు.మరి తమన్నా హాజరవుతుందో లేదో చూడాలి.

ఫెయిర్‌ప్లే యాప్  మహాదేవ్ ఆన్‌లైన్ గేమింగ్ యాప్ కి చెందిన  అనుబంధ అప్లికేషన్. క్రికెట్, పోకర్, బ్యాడ్మింటన్, టెన్నిస్, ఫుట్‌బాల్ కార్డ్ గేమ్‌లలో అక్రమ బెట్టింగ్ కోసం ప్లాట్‌ఫారమ్‌లని  అందిస్తుంది. గతంలో యాప్  ప్రచార ప్రకటనలలో కనిపించిన యానిమల్ రణబీర్ కపూర్ హీరోయిన్  శ్రద్ధా కపూర్‌లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  విచారణకి  పిలిచింది. దుబాయ్‌కి చెందిన సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ ఆ యాప్ సృష్టికర్తలు. ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌ వాళ్ళ స్వగ్రామం.