డైరెక్ట్ గా ఓటిటి లోకి ఫాహద్ మూవీ.. పార్టీ లేదా పుష్ప  

ఫాహద్ ఫాజిల్.. ఈ పేరు తెలియని  తెలుగు సినీ ప్రేమికుడు లేడు. కమల్ హాసన్  విక్రమ్,  అల్లు అర్జున్  పుష్ప లతో టాప్ రేంజ్ లోకి వెళ్ళాడు. దాంతో ఆయన సినిమా కోసం ప్రేక్షకులందరు ఎదురుచూసే పరిస్థితి. గూగుల్ లో కూడా ఆయన అప్ కమింగ్ మూవీస్ గురించి సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక వార్త ఆయన అభిమానుల్లో ఆనందాన్ని నింపుతుంది.

ఫాహద్ హీరోగా మొన్న ఏప్రిల్ 11 న  మలయాళంలో రిలీజైన మూవీ ఆవేశం. గ్యాంగ్ స్టార్ రంగా పాత్రలో  సూపర్ గా చేసాడు. ప్రతి ఒక్కళ్ళు ఆయన నటనకి  ఫిదా అయిపోయారు. హిట్ టాక్ ని తెచ్చుకోవడంతో  పాటు 100 కోట్ల క్లబ్ లో కూడా చేరింది. దీంతో  ఆవేశం మూవీ  తెలుగులోకి ఎప్పుడు  డబ్ అయ్యి ఎప్పుడు థియేటర్స్ లోకి అడుగుపెడుతుందా అని ఎదురుచూస్తు ఉన్నారు. కానీ ఆవేశం థియేటర్స్ లో రిలీజ్ కావటం లేదు. డైరెక్ట్ గా ఓటిటిలో విడుదల అవుతుంది. ప్రముఖ డిజిటల్ ఛానల్ అమెజాన్ ప్రైమ్ ద్వారా మే 9 న విడుదల కానుంది .తెలుగుతో పాటుగా  తమిళ, మలయాళ,కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది

ఫాహద్ 2002 లో సినీ రంగ ప్రవేశం చేసాడు. కెయుత్తామ్ దూరత్ ఫస్ట్  మూవీ. కేరళ కేఫ్,కాక్ టైల్, టోర్నమెంట్ ,చప్ప కురీషు, అకం, అన్నయుమ్ రసులం, రెడ్ వైన్, మాన్సూన్ మాంగోస్, లాంటి చిత్రాలు ఆయనకీ స్టార్ డం తెచ్చి పెట్టాయి.ఇప్పటికి వరకు సుమారు యాభై చిత్రాలకి పైనే చేసాడు. లెక్కకు మించి  ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డుల్ని కూడా గెలుచుకున్నాడు. ప్రొడ్యూసర్ గాను చాలా సినిమాలు నిర్మించాడు. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రేమలు కి  ఫాహద్ నే నిర్మాత.ప్రముఖ హీరోయిన్ నజ్రియా నజీమ్ ఎవరో కాదు  ఫాహద్ వైఫ్ నే