యూట్యూబ్ లో విడుదలైన సంచలన చిత్రం 'రాజధాని ఫైల్స్'

శ్రీమతి హిమ బిందు సమర్పణలో తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై కంఠంనేని రవిశంకర్ నిర్మించిన చిత్రం 'రాజధాని ఫైల్స్'. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వేలాది రైతుల కన్నీటి గాథను కళ్ళకి కట్టినట్టు చూపించిన ఈ చిత్రానికి భాను దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 15న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తెలుగునాట సంచలనం సృష్టించింది. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది.

'రాజధాని ఫైల్స్' ఫుల్ మూవీని తెలుగువన్ యూట్యూబ్ ఛానల్ వేదికగా శనివారం(మే 4న) సాయంత్రం విడుదల చేశారు. అలా విడుదలైందో లేదో.. యూట్యూబ్ లో ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి రైతుబిడ్డ చూడాల్సిన చిత్రమంటూ కామెంట్లు పెడుతున్నారు. చూస్తుంటే తక్కువ సమయంలోనే ఈ సినిమా యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ సాధించేలా ఉంది.

'రాజధాని ఫైల్స్' మూవీ రివ్యూ

అఖిలన్, వీణ, వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్ ప్రధాన పాత్రలు పోషించిన 'రాజధాని ఫైల్స్' చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. సినిమాటోగ్రాఫర్ గా రమేష్, ఆర్ట్ డైరెక్టర్ గా గాంధీ, ఎడిటర్ గా కోటగిరి వెంకటేశ్వరరావు వ్యవహరించారు.