132 మంది చిన్నారుల అంత్యక్రియలు

 

పాకిస్థాన్‌లోని పెషావర్ స్కూలు మీద తాలిబన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 132 మంది చిన్నారులతో సహా 141 మంది చనిపోయారు. స్కూలు మీద దాడి చేసిన అరుగురు తీవ్రవాదులను పాకిస్థాన్ భద్రతా దళాలు కాల్చి చంపాయి. తమ కుటుంబాల మీద పాకిస్థాన్ సైనికులు దాడి చేస్తున్నందువల్లే తాము స్కూలు మీద దాడి చేశామని తాలిబన్ వర్గాలు ప్రకటించాయి. దీనిని ప్రతికారం కోసం చేసిన దాడిగా అభివర్ణించాయి. ఈ ఘటనన ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. విద్యార్థుల మృతికి సంతాపంగా పాకిస్థాన్‌లో మూడు రోజులపాటు సంతాప దినాలను ప్రకటించారు. మరణించిన చిన్నారుల అంత్యక్రియలు బుధవారం నాడు తల్లిదండ్రులు, బంధుమిత్రుల రోదనల మధ్య జరిగాయి. ఈ ఘటన నేపథ్యంలో పాకిస్థాన్‌కి బాసటగా నిలుస్తామని భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో నరేంద్రమోడీ ఫోన్‌లో మాట్లాడారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో పాకిస్థాన్‌కి పూర్తిగా సహకరిస్తామని మోడీ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.