సుబ్బిరామిరెడ్డిని మట్టికరిపించిన మేకపాటి
posted on Jun 16, 2012 12:25PM
నెల్లూరు లోక్ సభ ఉప ఎన్నికల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మేకపాటి రాజమోహనరెడ్డి ఘనవిజయం సాధించారు. ఇక్కడ ఆయన తన సమీప ప్రత్యర్ధి, పారిశ్రామికవేత్త అయిన టి.సుబ్బరామిరెడ్డి రెండు లక్షల 91వేల 745 ఓట్ల తేడాతో ఓడించారు. నిజానికి సుబ్బరామిరెడ్డి ఇంత దారుణంగా ఓడిపోవడం కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. డబ్బు ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు పెట్టినప్పటికీ, తారలతో ప్రచారం చేయించినప్పటికీ సుబ్బరామిరెడ్డి ఈ నియోజకవర్గంలో పెద్దగా ఓట్లను పొందలేకపోయారు. ఆఖరినిమషంలో బరిలోకి దిగిన సుబ్బరామిరెడ్డి విజయం కోసం తన శాయశక్తులా కృషి చేశారు. విజయం సాధిస్తే ఆయనకు
కేంద్రంలో మంత్రి పదవి లభించే అవకాశాలు ఉండటంతో ఆయన ఖర్చుకు వెనుకాడకుండా ఎన్నికల్లో పాల్గొన్నారు. కానీ, నెల్లూరు ఓటర్లు సుబ్బరామిరెడ్డికి గట్టిషాక్ ఇచ్చారు. ఎన్నికల్లో మేకపాటి రాజమోహనరెడ్డి గెలుపొందటంతో లోక్ సభలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం రెండుకు పెరిగింది. జగన్మోహనరెడ్డి ఇప్పటికే లోక్ సభ అభ్యర్ధిగా ఉన్నారు.