పిల్లి పరాజయాన్ని ముందే తెలిపిన తెలుగువన్ డాట్ కామ్
posted on Jun 16, 2012 12:41PM
అంతా అనుకున్నట్లే అయింది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాయంగా 14స్థానాల్లో గెలుపొందుతుందని, మరో స్థానం పెరిగే అవకాశమూ ఆ పార్టీకి ఉందని తెలుగువన్.కామ్ '14స్థానాల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గెలుపు' అనే శీర్షికతో విశ్లేషణ చేసింది. వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు ఈ విశ్లేషణకు అనుగుణంగా ఉన్నాయి. అంతే కాకుండా ఈ విశ్లేషణలో చెప్పినట్లే పరకాల అసెంబ్లీ స్థానాన్ని టిఆర్ ఎస్ గెలుపొందింది. ఇదే విశ్లేషణలో డబ్బు, మద్యం ప్రభావం ఎంత ఎక్కువగా ఉందో కూడా విశదీకరించింది. వాస్తవ పరిస్థితులకు అద్దంపట్టేలా విశ్లేషణ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ప్రత్యేకించి రామచంద్రపురం అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి తోట త్రిమూర్తులు గెలిచే అవకాశాలున్నాయని తెలుగువన్.కామ్ 'అభినవ అన్నాకు శృంగభంగం తప్పదా' అన్న శీర్షికతో కూడిన విశ్లేషణలో విశదీకరించింది. ప్రత్యేకించి తాజామాజీ పిల్లి సుభాష్ చంద్రబోష్ వైఎస్ ఆర్ కాంగ్రెస్ తరుపున పోటీ చేసినా సామాజిక కులాల మద్దతు తోటకు ఉందని తెలియజేసింది. ఎన్నికల ఫలితం కూడా ఈ విశ్లేషణకు తగినట్టుగానే ఉంది. ఈ విశ్లేషణలకు మంచి స్పందనా కూడా వచ్చింది. అలానే వై.కా.పా. గౌరవాధ్యక్షురాలు విజయమ్మ జగన్ ను సిబిఐ అరెస్టు చేశాక ప్రచార బాధ్యతలు చేపడతారనీ, ఆమెకు రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఇచ్చిన శిక్షణ వల్ల విజయమ్మ రాల్చే కన్నీటి బొట్లకు సానుభూతి ఓట్లు పడతాయని కూడా తెలుగువన్. కామ్ ముందుగానే చెప్పింది.