పొంగులేటి అందుకే వెళ్లిపోయారా?
posted on Sep 15, 2015 5:27PM

తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ విభేదాలు బయటపడ్డాయి. టీకాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం సాక్షిగా నేతల మధ్య అనైక్యత మరోసారి బయటపడింది. కేసీఆర్ ను, టీఆర్ఎస్ ను ఎదుర్కోవడంలో ఈ మధ్య కలిసికట్టుగా ముందుకెళ్తున్నారని అనిపించినా, ఇంతలోనే విభేదాలు రచ్చకెక్కాయి. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు సమావేశమైన భేటీ నుంచి ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అర్థాంతరంగా వెళ్లిపోయారు. ప్రధానంగా రైతుల ఆత్మహత్యలు, ఎక్స్ గ్రేషియా, రుణమాఫీ అంశాలపై సభను స్తంభింపజేయాలని నిర్ణయం తీసుకోగా, తాను సూచించిన పోలవరం ముంపు గ్రామాల అంశాన్ని అజెండాలో ఎందుకు చేర్చలేదంటూ పొంగులేటి ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. తన డిమాండ్ పై మిగతా నేతల సరిగా స్పందించకపోవడంతో అలిగిన పొంగులేటి...సోనియా వద్దే తేల్చుకుంటానంటూ సమావేశం మధ్య నుంచి వెళ్లిపోయారు.