మహేష్ బాబుపై చంద్రబాబు పొగడ్తల వర్షం
posted on Sep 15, 2015 4:57PM

శ్రీమంతుడు సినిమా రిలీజై...ఆరు వారాలవుతున్నా, ఇంకా సంచలనాలు స-ష్టిస్తూనే ఉంది. బాహుబలి తర్వాత అత్యధిక కలెక్షన్లతో కొత్త రికార్డులు నెలకొల్పిన ఈ శ్రీమంతుడు... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని సైతం మెప్పించింది. అత్యంత బిజీ షెడ్యూల్ లోనూ కాస్తంత తీరిక చేసుకుని...శ్రీమంతుడు సినిమా చూసిన టీడీపీ అధినేత... ఆ చిత్ర యూనిట్ ను అభినందించారు. మహేష్ బాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. సమాజానికి ఎంతోకొంత తిరిగివ్వాలన్న కాన్సెప్ట్ చాలా బాగుందని, మహేష్ అద్భుతంగా నటించాడని మెచ్చుకున్నారు.తాను ప్రారంభించిన స్మార్ట్ విలేజ్-స్మార్ట్ వార్డ్ కాన్పెప్ట్ ను సినిమాను పోలి ఉందన్న చంద్రబాబు... ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు ట్వీట్స్ కు స్పందించిన ప్రిన్స్ మహేష్ ...తమ సినిమా నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందంటూ రిప్లై ఇచ్చారు.
