కేంద్ర బృందం నోట్లోకి ఈగలు.. దోమలు?

 

హైదరాబాద్‌ని వణికిస్తున్న స్వైన్ ఫ్లూ గురించి అధికార వర్గాలు మొదట్లో జనాన్ని భయభ్రాంతులకు గురిచేశాయి. 21 మంది చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ‌ కూడా జనానికి హెచ్చరికలు జారీ చేశారు. ఆరోగ్య శాఖ అధికారులకు క్లాస్ పీకారు. మోడీకి, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ఫోన్ చేసి మాట్లాడారు. ఆ తర్వాత కార్పొరేట్ ఆస్పత్రుల వారితో మాట్లాడారు. స్వైన్ ఫ్లూ గురించి భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. కేంద్ర నుంచి మందులు, వ్యాక్సిన్లు, ప్రత్యేక బృందం వస్తుందని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే కేంద్రం నుంచి ప్రత్యేక బృందం హైదరాబాద్‌కి వచ్చింది. ఈ బృందంలో జాతీయ వ్యాధి నిరోధక కేంద్రం డైరెక్టర్ జనరల్ డాక్టర్ అశోక్ కుమార్, అదనపు డైరెక్టర్ శశిరేఖతో పాటు సమీకృత వ్యాధుల పర్యవేక్షణ కార్యక్రమం అధికారి డాక్టర్ ప్రదీప్ ఖస్నోబిస్ ఉన్నారు. వీరందరూ కేంద్ర మంత్రి దత్తాత్రేయతో కలసి గాంధీ ఆస్పత్రికి వెళ్ళారు. అక్కడి పరిస్థితులు చూసి కేంద్ర బృందంలోని సభ్యులందరూ నోళ్లు తెరిచారు. అపరిశుభ్రమైన వాతావరణం, స్వైన్ ఫ్లూ రోగులకు సరైన విధంగా వైద్యం అందించకపోవడం, స్వైన్ ఫ్లూ వ్యాధితో చనిపోయిన వారి వివరాలు కూడా అక్కడ లభించకపోవడంతో అవాక్కపోయి నోళ్ళు తెరిచేశారు. అసలే అపరిశుభ్రతకు నిలయమైన గాంధీ ఆస్పత్రిలో వాళ్ళు నోళ్ళు తెరిచారు. అప్పుడు వాళ్ళ నోళ్ళలోకి ఈగలు, దోమలు వెళ్ళకుండా వుంటాయా?

Online Jyotish
Tone Academy
KidsOne Telugu