నిర్మలమ్మ బడ్జెట్ 2023-24 .. కొంచం తీపి.. కొంచెం చేదు

నిర్మలా సీతారామన్ బుధవారం (ఫిబ్రవరి 1) లోక్ సభలో ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ తీపి చేదుల మిశ్రమంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమౌతున్నది. ఆర్థిక నిపుణులు మాత్రం బడ్జెట్ కేటాయింపులపై పెదవి విరుస్తున్నారు. మొత్తంగా నిర్మలమ్మతన బడ్జెట్ లో వేతన జీవులకు ఒకింత ఊరట కలిగించేలా ఆదాయ పన్ను పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 7లక్షల రూపాయలకు పెంచారు. అలాగే సీనియర్ సిటిజన్ల పొదుపు పరిమితిని రూ.15లక్షల నుంచి 30 లక్షల రూపాయలకు పెంచారు. ఆదాయం 7 లక్షలు దాటితే ఐదు స్లాబుల్లో పన్ను విధిస్తారు.

అంటే 7లక్షల నుంచి 9 లక్షల వరకూ 5శాతం, ఆదాయం 30 లక్సలు దాటితే 30శాతం పన్ను విధిస్తారు. ఇక  ధూమ పాన ప్రియులకు నిర్మల షాక్ ఇచ్చారనే చెప్పాలి. పొగాకు ఉత్పత్తులపై భారీగా వడ్డించారు. దీంతో సిగరెట్ల ధరలు పెరుగుతాయి. ఒక బంగారం, వెండి లపై కస్టమ్స్ డ్యూటీ పెంచారు. దీంతో వీటి ధరలూ పెరుగుతాయి. అలాగే బ్రాండెడ్  దుస్తుల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతాయి. ఇక టీవీలు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రికల్ వాహనాల ధరలు తగ్గుతాయి.    

నిరుద్యోగులకు కూడా ఒకింత ఊరట కలిగించేందుకు నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ లో నిధులు కేటాయించారు. నాలుగు లక్షల మంది  నిరుద్యోగులకు  పీఎం కౌశల్ పథకం కింద శిక్షణ ఇస్తారు. స్వదేశీ ఉత్పత్తుల విక్రయాలను ప్రోత్సహించడానికి యూనిటీ మాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.  

ఇక దేశంలో 50 టూరిస్ట్ స్పాట్‌ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించారు. ప్రభుత్వ రంగంలో కాలం చెల్లిన వాహనాలను మార్చేందుకు ప్రత్యేక నిధులు కేటాయించారు.  ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఫార్మా రంగ అభివృద్ధికి ప్రత్యేక పథకం తీసుకువచ్చారు. విద్యుత్ రంగానికి 35 వేల కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా కొత్తగా 50 ఎయిర్‌పోర్టులు, హెలిప్యాడ్‌ల నిర్మాణానికి నిధులు కేటాయించారు.  5జీ సేవల అభివృద్ధికి 100 ప్రత్యేక ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. కొవిడ్ సమయంలో నష్టపోయినఎంఎస్ఎంఈలకు రిఫండ్ పథకం అమలు చేస్తారు. అలాగే ఈ-కోర్టుల ప్రాజెక్ట్‌కు రూ.7వేల కోట్లు కేటాయింపు వ్యాపార సంస్థలకు ఇకపై పాన్‌ కార్డు ద్వారానే గుర్తింపు ఉంటుందన్నారు. 

గిరిజన మిషన్‌ కోసం రూ.10వేల కోట్లు కేటాయించారు. అలాగే  పట్టణ ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పన కోసం ఏడాదికి పదివేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.   కృత్రిమ మేధ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించారు. రాష్ట్రాలకు వడ్డీలేని రుణాల పథకాన్ని  మరో ఏడాది పొడిగించారు.   వడ్డీలేని రుణాల పథకం కోసం రూ.13.7 లక్షల కోట్లు కేటాయించగా,  బడ్జెట్‌లో మూలధన వ్యయానికి రూ.10లక్షల కోట్లు కేటాయించారు.  పీఎం మత్స్యసంపద యోజనకు అదనంగా రూ.6వేల కోట్లు,  గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం రూ.15వేల కోట్లు పీఎంఏవై కోసం రూ.79వేల కోట్లు కేటాయించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu