బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులివే!

ఎన్నికల సంవత్సరం పైగా తెలంగాణలో అధికారంపై బీజేపీకన్నేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు బడ్జెట్ లో పెద్ద పీట వేస్తారని అంతా భావించారు. తెలంగాణ ప్రజలూ బడ్జెట్ లో తెలంగాణకు కేటాయింపులపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల కేంద్రంతో పెరిగిన దూరం నేపథ్యంలో బడ్జెట్ కు ముందు తెలంగాణ సర్కార్ పెద్దగా డిమాండ్లేవీ పెట్టలేదు. ఒక విధంగా బడ్జెట్ లో తెలంగాణకు ఎలాంటి కేటాయింపులూ లేకుంటే బాగుంటుంది అన్నట్లుగా తెలంగాణ సర్కార్ వ్యవహరించింది.

బడ్జెట్ లో తెలంగాణకు ప్రాధాన్యత లేకపోతే.. తన విమర్శలకు మరింత పదును పెట్టి ఎన్నికలలో లబ్ధి పొదాలన్న వ్యూహంతో  బీఆర్ఎస్ సర్కార్ వ్యవహరించింది. అందుకే గత బడ్జెట్ కు ముందు తెలంగాణకు కావాల్సినవి ఇవీ అంటూ లేఖాస్త్రాలను సంధించేది. రైల్వే ప్రాజెక్టులపై గొంతెత్తేది. కోచ్ ఫ్యాక్టరీ కోసం డిమాండ్ చేసేది. అయితే ఈ సారి మాత్రం బీఆర్ఎస్ ఎలాంటి డిమాండ్లూ చేయలేదు. సరే బీఆర్ఎస్ సర్కార్ అడక్కపోయినా..రాష్ట్రంలో అధికారం కోసం బీజేపీ అర్రులు సాచుతున్న సమయంలో ప్రజల మెప్పు పొందడానికి తెలంగాణకే కేటాయింపులలో సింహభాగందక్కుతుందని అంతా భావించారు.

కానీ కేంద్రం మాత్రం ఎన్నికలు ఎన్నికలే.. బడ్జెట్ కేటాయింపులు బడ్జెట్ కేటాయింపులే రెంటికీ సంబంధం లేదన్న తీరుగానే వ్యవహరించింది. ఈ సారి బడ్జెట్ లో కూడా తెలంగాణకు దక్కాల్సిన కేటాయింపులు దక్కలేదు. ఏదో ఊరడింపు అన్నట్లుగా నిధులు విదిలించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రూ.56 కోట్లు, హైదరాబాద్లోని అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ఆఫ్ ఎక్స్ ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ కు రూ.374.35 కోట్లు, హైదరాబాద్ ఐఐటీకి రూ.300కోట్లు కేటాయించి చేతులు దులిపేసుకుంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu