సుష్మా స్వరాజ్ పై పొగడ్తల వర్షం కురిపించిన విపక్షాలు..

 

పార్లమెంట్ సమావేశాల్లో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా సమావేశాల్లో అధికార పక్షాలు.. విపక్షాల మధ్య గొడవలు జరుగుతుంటాయి. అందునా ఇక ఆప్ బీజేపీ సంగతైతే చెప్పనవసరం లేదు.. నిప్పూ, ఉప్పులా ఉండే ఈ రెండు పార్టీలు ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని ఎదురుచూస్తుంటాయి.. అలాంటిది ఇప్పుడు నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో అందుకు భిన్నంగా విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ పై విపక్షాలు పొగడ్తల వర్షం కురిపించారు. ఆప్ ఎంపీ భగవంత్ మాన్ సుష్మా గురించి మాట్లాడుతూ.. మన దేశ ప్రజలు విదేశాల్లో ఇబ్బందులు పడ్డ వేళ.. సుష్మా చూపిన చొరవ అభినందనీయం అంటూ.. తమ నియోజక వర్గానికి చెందిన 13 మంది సౌదీలో బానిసలుగా బతుకుతూ ఇబ్బందులు పడుతున్నారని సుష్మా దృష్టికి తీసుకెళ్లామని.. అందుకు ఆమె స్పందిచిన తీరు అద్భుతమని కొనియాడారు. ఆయన ఒక్కడే కాదు ఇంకా పలువురు ఎంపీలు కూడా సుష్మాపై పొగడ్తలు కురిపించారు.

మరో ఎంపీ ధరమ్ వీర్ గాంధీ మాట్లాడుతూ..నేను మిమ్మల్నీ ఏ ప్రశ్నా అడగను.. మీకు కృతజ్ఞతలు చెప్పడానికి లేచా అని అన్నారు.

బిజూ జనతా దళ్ నేత బైజయంత్ పాండా మాట్లాడుతూ.. ఓ మంత్రిగా ఆమె స్పందించే తీరు అత్యద్బుతమని అన్నారు.

ఆర్జేడీ సభ్యుడు రాజేష్ రంజన్ కూడా మాట్లాడుతూ.. నేతలు ఇంగ్లీషులో ప్రశ్నలు వేసినా.. ఆమె మాత్రం హిందీలో సమాధానం చెప్పడం గొప్ప విషయమని చెప్పుకొచ్చారు. ఇక వీరందరి పొగడ్తలకు ఉబ్బితబ్బిబైన సుష్మా తనను అభినందించిన వారందరికి చేతులెత్తి నమస్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఏది ఏమైన ప్రతిపక్షనేతలతో పొగిడించుకోవడం ఎంతైనా గొప్ప విషయమే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu