ఫస్ట్ మోడీ.. తరువాత రాజ్ నాథ్ సింగ్.. ఆ తరువాత?

 

 ప్రతి పార్టీలో పార్టీ అధినేత ఫస్ట్ ప్లేస్లో ఉన్నా.. తర్వాత ప్లేస్ ఎవరో ఒకరికి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఎప్పుడైనా అధినేత అందుబాటులో లేనప్పడు తరువాతే వ్యక్తే పార్టీ బాధ్యతలు చూసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ సదరు వ్యక్తి కూడా లేకపోతే పరిస్థితి ఏంటి.. ఆ తరువాత వ్యక్తి బాధ్యతులు స్వీకరిస్తారు. ఇప్పుడు అదే జరిగింది. దీంతో ఆవ్యక్తి స్థానం ఏంటో తెలిసింది. ఇంతకీ ఎవరా వ్యక్తి అనుకుంటున్నారా.. సుష్మా స్వరాజ్.

మోడీ సర్కారులో ఫస్ట్ ప్లేస్ మోడీదే.. నో డౌట్ అలాగే మోడీ తరువాత రెండో ప్లేస్ ఎవరిది అంటే వెంటనే గుర్తొచ్చే పేరు రాజ్ నాథ్ సింగ్. మోడీ విదేశీ పర్యటనలు చేస్తూ బిజీగా ఉంటూరు కాబట్టి ఇక్కడ ఇంఛార్జ్ గా రాజ్ నాథ్ సింగ్ బాధ్యతులు నిర్వహిస్తారు. అలాగే రాజ్ నాథ్ సింగ్ లేనప్పుడు ఎవరు బాధ్యతలు చూసుకుంటారంటే అందరూ అరుణ్ జైట్లీ అనుకుంటారు అందరూ. కానీ అందరూ అనుకునేది తప్పని తెలిసిపోయింది. తాజాగా రాజ్ నాథ్ సింగ్ కూడా విదేశీ పర్యటనకు వెళ్లగా మూడు రోజులు సుష్మాస్వరాజ్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రాజ్ నాథ్ సింగ్ పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే రాజ్ నాథ్ సింగ్ కు బాధ్యతలు అప్పగించారు. మోడీ కూడా తిరిగి వచ్చిన వెంటనే రాజ్ నాథ్ సింగ్ మోడీకి బాధ్యతలు అప్పగిస్తారు. మొత్తానికి ఎన్డీయే సర్కారులో మొదటి ప్లేస్ మోడీది రెండో ప్లేస్ రాజ్ నాథ్ సింగ్ ది మూడోది సుష్మా స్వరాజ్ ది అని తెలిసిపోయింది.