రోడ్డు ప్రమాదంలో ఎస్సై, కానిస్టేబుల్ మృతి
posted on Jun 26, 2025 10:16AM

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దుర్గాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ బైపాస్‌లోని దుర్గాపురం వద్ద జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న ఒక కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారు కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్సై అశోక్, మరొక కానిస్టేబుల్‌గా పోలీసులు గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను అతి కష్టం మీద బయటకు తీసి, చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు సమాచారం. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం అతివేగం, డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణాలుగా పోలీసులు భావిస్తున్నారు.ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు