రైలు పట్టాలపై కారు నడిపి యువతి హల్‌చల్
posted on Jun 26, 2025 10:32AM

రైలు పట్టాలపై కారు నడుపుతూ యువతి హల్‌చల్ చేసింది. రంగారెడ్డి జిల్లాలోని నాగుపల్లి-శంకర్‌పల్లి మార్గంలో రైలు పట్టాలపై కారు నడుపుతూ వెళ్లింది. గమనించిన రైల్వే సిబ్బంది ఆపడానికి యత్నించారు. అయినప్పటికీ ఆగకుండా వెళ్లిపోయింది. ఈ క్రమంలో నాగులపల్లిలో స్థానికులు కారును అడ్డుకున్నారు. దీంతో వారిని చాకుతో బెదిరించింది. అదే సమయంలో ఓ రైలు రాగా అప్రమత్తమైన లోకోఫైలట్ రైలును ఆపేయడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యువతిని అదుపులోకి తీసుకున్నారు.
యువతి నిర్వాకంతో గంటల తరబడి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిసింది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న రైళ్లను అధికారులు నిలిపివేశారు. కాగా, యువతి మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తున్నది. అనంతరం శంకర్‌పల్లి పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పట్టాలపై కారు నడిపిన యువతిని ఉత్తరప్రదేశ్, లఖ్‌నవూకి చెందిన రవికా సోనిగా గుర్తించారు. రీల్స్ కోసమే ఈ నిర్వాకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆమె హైదరాబాద్‌లోని ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తోంది.