కపిల్ సిబల్ కు సుప్రీంకోర్టు చురక
posted on Jul 4, 2015 6:24PM

రేవంత్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన బెయిల్ తీర్పును సవాల్ చేస్తూ ఏసీబీ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు బెయిల్ రద్దు పిటిషన్ రద్దు చేస్తూ రేవంత్ రెడ్డిని ఇన్ని రోజులు జైల్లోనే ఉంచుకున్నారు.. ఇంకా ఉంచుకొని ఏం చేస్తారు అని చెప్పి తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఏసీబీ తరపు న్యాయవాదులలో ఒకరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కు సుప్రీంకోర్టు చురకలు అంటించింది.
రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసి అతనిని దాదాపు నెల రోజుల నుండి జైలులోనే ఉంచారు.. నాలుగు రోజులు విచారణ జరిపారు.. అయినా బెయిల్ ఇవ్వడం సరికాదని అంటున్నారు.. కొన్ని కేసుల్లో నిందితుడు అరెస్ట్ అయిన ఒక్క రోజుకే బెయిల్ మంజూరు చేయాలని మీరు వాదించిన రోజులు లేవా అని సుప్రీంకోర్టు జడ్డి హెచ్.ఎల్. దత్తు కపిల్ ను ప్రశ్నించారు.
న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు కపిల్ ఖంగుతిన్నట్టు సమాచారం. అంతేకాక నిందితుడు నాలుగు రోజులు మీ కస్టడీలోనే ఉన్నాడు. అతని వాంగ్మూలం కూడా తీసుకున్నారు. అయినా నెల రోజులు జైల్లో ఎందుకు పెట్టారు? ఇప్పుడు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని ఎందుకు అడుగుతున్నారు? మళ్లీ అతన్ని జైల్లో పెట్టడం ఎందుకు?' అని ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించే సరికి మిన్నకుండిపోయారట.