సండ్రకు మళ్లీ నోటీసులు
posted on Jul 4, 2015 5:45PM

ఓటుకు నోటు కేసులో నిందితుడిగా భావించి గతంలో తెలంగాణ ఏసీబీ అధికారులు సండ్ర వెంకటయ్యని విచారణలో పాల్గొనాలని నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు అతనికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో విచారణకు పదిరోజులు గడువు తీసుకొని తరువాత విచారణలో పాల్గొంటానని చెప్పడంతో ఏసీబీ అందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో సండ్ర కూడా ఏసీబీకి లేఖ రాశాడు. ఇప్పుడు తన ఆరోగ్యం బాగానే ఉందని ఎప్పుడు విచారణకు రమ్మన్నా సిద్ధంగా ఉన్నానని లేఖలో పేర్కొన్నారు. అయితే టీ ఏసీబీ మళ్లీ ఇప్పుడు సండ్రకు నోటీసులు జారీ చేసింది. సోమవారం సాయంత్రం 6 గంటలలోపు ఏసీబీ కార్యాలయానికి రావాలని సూచించారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు వెళ్లిన ఏసిబి అధికారులు, సండ్ర వెంకటవీరయ్య ఇంటి వద్ద లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించారు.