సుప్రీం కోర్టు ప్రొసీడింగ్స్ ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం!

సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయమూర్తి జ‌స్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ ప‌ద‌వీ కాలం శుక్ర‌వారం (ఆగ‌ష్టు 26) ముగియ‌ నుంది. కాగా శుక్ర‌వారం కోర్టు ప్రొసీడింగ్స్‌ను ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం చేయ‌నున్నారు. వాస్త‌వానికి కోర్టు ప్రొసీడింగ్స్ ఇలా ప్రత్య‌క్ష‌ప్ర‌సారం ఇంత‌వ‌ర‌కూ జ‌ర‌గ‌లేదు.  కోర్టు వాద‌న‌లు టెలికాస్ట్  చేయ‌డం న్యాయ‌ మూర్తుల‌పై ఒత్తిడి పెరుగుతుందనే అభిప్రాయాలున్నాయి. ఈ కార‌ణంగానే ప్రొసీడింగ్స్‌ను ప్ర‌త్య‌క్ష‌ ప్ర‌సారానికి ఎవ‌రూ అంగీ క‌రించ లేదు.  

కాగా,  శుక్రవారం రోజు విచారణకు రానున్న, తీర్పు వెలువరించనున్న కేసులకు సంబంధించిన జాబి తాను ప్రకటించింది. కాగా.. నేడు సీజేఐ‌గా జస్టిస్‌ రమణ ఐదు కీలక కేసులుపై తీర్పులను  వెలువరిస్తు న్నారు. విశేషం ఏంటంటే.. తొలిసారిగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ‌తో కూడిన ప్రొసీడింగ్స్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. 

దీంతో ఇప్పటి వరకూ లైవ్ ప్రొసీడింగ్స్‌కు అనుమతి ఇవ్వలేదు. కానీ ఎన్వీ రమణ తొలి నుంచి కూడా కోర్టు ప్రొసీడింగ్స్ లైవ్ ఇవ్వాలి అని వాదించారు. కోర్టులో వాదనలు ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం ఇవ్వ‌డం సాధ్యా సాధ్యాల‌పై  ఒక  కమిటీని  కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సైతం లైవ్ ఇవ్వొచ్చు అని నివేదిక ఇచ్చింది. అయితే  దీనిని కొందరు న్యాయమూర్తులు ఇష్టపడలేదు.  చివరికి తన ఫేర్ వెల్‌ను అయినా ఇలా లైవ్ ఇవ్వాలని సీజేఐ ఎన్వీ రమణ భావించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu