జాతి నిర్మాణంలో శ్రామిక‌శ‌క్తిదే కీల‌క‌పాత్ర‌.. ప్ర‌ధాని మోదీ

క‌రోనా కాలంలో ప్ర‌పంచ‌మంతా భ‌యాందోళ‌నలు పీడిస్తున్న స‌మ‌యంలో దేశాన్ని గ‌ట్టెక్కించేందుకు కార్మికులు పూర్తి శ‌క్తిసామ‌ర్ధ్యాల‌ను వెచ్చించార‌ని ప్ర‌ధాని మోదీ  కితాబునిచ్చారు.  తిరుపతిలో రెండు రోజుల జాతీయ కార్మికసదస్సును ఆయన గురువారం(ఆగ‌ష్టు 25) ఢిల్లీ నుంచీ వర్చు వల్‌గా ప్రారంభిం చారు.  భార‌తదేశ క‌ల‌లు, ఆశ‌ల‌ను నెర‌వేర్చ‌డం ద్వారా జాతి నిర్మాణంలో శ్రామిక శ‌క్తి ప్ర‌ధాన‌పాత్ర పోషి స్తోంద‌ని ప్ర‌ధాని మోదీ కొనియాడారు. ఈ ఘ‌న‌త త‌ప్ప‌కుండా త‌ప్ప‌కుండా కార్మికుల‌కే ద‌క్కుతుం ద‌న్నారు. దేశంలో  కోట్లాదిమంది సంఘ‌టిత‌, అసంఘ‌టిత రంగాల కార్మికుల సంక్షేమం కోరి నిరంత‌రం త‌మ ప్ర‌భుత్వం శ్ర‌మిస్తున్న‌ద‌ని అన్నారు. ఒక  అధ్యయనం ప్రకారం  ది ఎమర్జెన్సీ క్రెడిట్‌ గ్యారంటీ స్కీమ్‌ కరోనా కష్ట కాలంలో 1.50 కోట్ల ఉద్యోగాలను కాపాడిందని తెలిపారు. కార్మిక శక్తికి భద్రత కల్పించడంలో ఇ-శ్రమ్‌ పోర్టల్‌ కీలకపాత్ర పోషిస్తోందని, ఏడాదిలోనే 28 కోట్లమంది కార్మికులు పోర్టల్‌లో నమోదయ్యారని తెలి పారు. 

కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఎస్‌హెచ్‌ భూపేంద్ర యాదవ్‌ అధ్యక్షత వహించిన ఈ సదస్సుకు వివిధ రాష్ట్రాల కార్మికశాఖ మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కేంద్రం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి శ్రమయోగి మాన్‌ధన్‌ యోజన, ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమాయోజన తదితర పథకాలు కోట్లాదిమంది కార్మికులకు ఎంతో కొంత రక్షణ, భద్రత కల్పిస్తున్నా యని ప్రధాని చెప్పారు. 

భవన నిర్మాణ కార్మికుల సెస్‌ నిధులను రూ.38 వేల కోట్లకుపైగా రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచం డిజిటల్‌ యుగంలోకి ప్రవేశించిందని, ఆన్‌లైన్‌లో  షాపింగ్‌, హెల్త్‌ సర్వీ సెస్‌, ట్యాక్సీ, ఫుడ్‌ డెలివరీ జీవితంలో భాగమయ్యాయన్నారు. ఈ రంగాల్లో సరైన విధానాలు, సరైన కృషి దేశాన్ని ప్రపంచానికి నాయకత్వం వహించేలా చేస్తాయని చెప్పారు.

ఇదిలా ఉండ‌గా, కార్మిక చట్టాలను హరించే సదస్సు.. జాతీయ కార్మికసదస్సును అడ్డుకుంటామని కార్మి క సంఘాల నేతలు ముందుగానే ప్రకటించడంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.  సుమా రు 200 మందిని అదుపులోకి తీసుకొని రామచంద్రాపురంలో నిర్బంధించారు. సదస్సు జరిగే ప్రాంతానికి ర్యాలీగా వస్తున్న సీపీఎం నేతలు పి.మధు, గఫూర్‌, ఏఐటీ యూసీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రనాథ్‌ సహా పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కార్మిక చట్టాలను హరించేందుకు సదస్సు నిర్వహిస్తుంటే దానికి జగన్‌ ఆతిథ్యమివ్వడం దారుణమని మధు, గఫూర్‌, రవీంద్రనాథ్‌, ఐఎ ఎఫ్‌టీయూ నేత ప్రసాద్‌ విమర్శించారు.  తమను అమానుషంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. దీనిపై శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలియజేస్తామని ప్రకటించారు.    

Online Jyotish
Tone Academy
KidsOne Telugu