కేంద్ర మంత్రి సుజనా చౌదరి బిజీ బిజీ

 

కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తెలుగుదేశం నాయకుడు సుజనా చౌదరి తన మంత్రిత్వ శాఖకు చెందిన కార్యక్రమాలతో హైదరాబాద్‌లో బిజీబిజీగా వున్నారు. శుక్రవారం నాడు ఆయన హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ పరిశోధనా కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ, దేశంలోని సైన్స్ పరిశోధనా కేంద్రాల్లో అభివృద్ధి పరంగా రానున్న 90 రోజుల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుందని అన్నారు. యువత టెక్నాలజీ వైపు చూపిస్తున్న ఆసక్తి సైన్స్ మీద చూపించడం లేదన్నది వాస్తవం కాదని ఆయన అన్నారు. మన దేశంలోని పరిశోధనా సంస్థలు మనకు అందుబాటులో వున్న ఉద్యోగ అవకాశాలు, అభివృద్ధి ప్రణాళికలను వారికి అర్థమయ్యేలా వివరిస్తే పరిశోధకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందని సుజనా చౌదరి అన్నారు. దేశంలోని ప్రతి విశ్వవిద్యాలయంలో ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. అలాగే అన్ని రాష్ట్రాల్లోనూ సీఎన్ఆర్ఐ ఇన్‌స్టిట్యూట్లు ఏర్పాటు చేయాలనే యోచనలో వున్నట్టు కేంద్ర మంత్రి సుజనా చౌదరి వెల్లడించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu