కేసీఆర్ పాలన హిట్లర్ పాలన.. లోకేష్..
posted on Nov 14, 2014 5:11PM

సమయం, సందర్భం దొరికినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద తెలుగుదేశం యువ నాయకుడు చురుకైన బాణాలు విసురుతూ వుంటారు. ముఖ్యంగా ట్విట్టర్ ద్వారా ఆయన విమర్శనాస్త్రాలు సంధిస్తూ వుంటారు. తాజాగా రేవంత్ రెడ్డి ఇష్యూలో లోకేష్ స్పందించారు. టీఆర్ఎస్ గూండాలు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డిపై దాడులు చేస్తున్నారంటూ నారా లోకేష్ ట్విట్టర్లో ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో రెండు ట్వీట్లు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని రౌడీలే నడిపిస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ హిట్లర్లా పాలిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ప్రపంచ ఎకనమిక్ ఫోరంలో ప్రమోట్ చేయడంలో బిజీబిజీగా గడుపుతుంటే.. కేసీఆర్ అండ్ కో మాత్రం విద్వేషాలను ప్రమోట్ చేస్తున్నారని, ఇది దురదృష్టకరమని లోకేష్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు.