చేదెక్కనున్న చక్కెర?

 

సామాన్యుల నుండి అందరికి అవసరం చక్కెర. అయితే ధనవంతులు చక్కెరను బహిరంగమార్కెట్‌లో రేటు ఎక్కువైనా కొనుక్కోగలరు. కాని సామాన్య, మధ్యతరగతి వారికి అలా కొనుక్కోవాలంటే...స్వచ్ఛందంగా ఇతర అవసరాలను తగ్గించుకోవలసి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో వారికి రేషన్‌ చక్కెర ఇప్పటివరకు కాస్తోకూస్తో సహాయపడుతోంది. అయితే ఇకనుండి రేషన్‌ చక్కెర 25 రూపాయలకు చేరనుంది. ఒకప్పుడు ఐదు నుండి రెండు కిలోల వరకు రేషన్‌షాపు కార్డులను బట్టి ఇచ్చే చక్కెర క్రమంగా తగ్గి నేడు కొన్ని రంగుల కార్డులకు అసలు చక్కెర అందకుండాపోతుంటే మరికొన్నిటికి అరకిలో, కిలో మాత్రమే అందుతోందని సామాన్యుల వాపోతున్నారు. ఢవనంతులు వాడే పలురకాల వస్తువులపై, మద్యంధరలను పెంచుకోవడం వల్ల వచ్చే ఆదాయాన్ని రేషన్‌కు మళ్లిస్తే సామాన్యులకు పాతధరకే అందించే ప్రయత్నం చేయవచ్చని ఆ దిశగా ఆలోచించి ప్రయత్నాలు చేస్తే బావుంటుందని.. ఆశావహులైన సామాన్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు. పాలకుల మనసు మారకపోతుందా అని!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu