టాటా గ్రూప్ లో కూడా వేలు పెట్టిన స్వామి...


బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి గురించి అందరికి తెలిసిందే. ఆయన మాట్లాడటానికి, సంచలన వ్యాఖ్యలు చేయడానికి ఒక టాపిక్ ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తాజాగా టాటా గ్రూప్ గురించి కూడా మాట్లాడేశారు. టాటా గ్రూప్ ఛైర్మన్ పదవి నుండి సైరస్ మిస్త్రీని తొలగించిన సంగతి విదితమే. ఆయన స్థానంలో ప్రస్తుతం తాత్కాలికంగా రతన్‌ టాటా బాధ్యతలు స్వీకరించారు. అయితే పదవి నుండి తొలగించిన అనంతరం.. టాటా గ్రూప్‌పై సైరస్‌ మిస్త్రీ తీవ్ర ఆరోపణలు చేశారు.  ఎయిర్‌ ఏషియాకు సంబంధించి మోసపూరిత లావాదేవీలు జరిగాయని.. వీటి గురించి టాటా బోర్డు సభ్యులకు, ట్రస్టీలకు కూడా తెలుసని ఆరోపించారు. నేపథ్యంలో దీనిపై స్పందించిన సుబ్రహ్మణ్యస్వామి.. టాటా గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తుకు మల్టి-ఏజెన్సీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)ను ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, సెబీ తదితర అధికారులతో కూడిన సిట్‌ను నియమించాలని ఆయన మోదీకి లేఖ రాశారు.