మళ్లీ కేసీఆర్ కే నెంబర్ వన్ స్థానం..

 

తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తరువాత దాదాపు ఏ సర్వేలు చేసినా... కేసీఆర్ కానీ.. రాష్ట్రం కానీ ముందు ప్లేస్ లోనే ఉంటున్నారు. ఇప్పుడు మరో సర్వేలో కేసీఆర్ నెంబర్ వన్ స్థానంలో నిలిచారు.  దేశంలో అత్యంత జనాదరణ కలిగిన సీఎంల గురించి వీడీపీ అసోసియేట్స్‌ నిర్వహించిన సర్వేలో 87 శాతం రేటింగ్‌తో కేసీఆర్‌ అగ్రస్థానంలో నిలిచారు. రెండోస్థానంలో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, మూడో స్థానంలో పశ్చిమ్‌బంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఉన్నారు. అంతేకాదు ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగినా.. తెరాసకు 51 శాతం ఓట్లు వస్తాయని వీడీపీ సర్వే వెల్లడించింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత 75శాతం రేటింగ్‌తో నాలుగో స్థానంలో, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఐదో స్థానంలో, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ఆరో స్థానంలో నిలిచారు. ఇక రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 58 శాతం రేటింగ్‌తో 8వ స్థానంలో నిలిచారు.