ఇరాన్ ఇజ్రాయెల్ బలాబలాలేంటి?
posted on Jun 16, 2025 1:16PM

ఇటు సాంకేతికంగా, అటు బడ్జెట్ పరంగా చూస్తే ఇరాన్ కన్నా ఇజ్రాయెలే ఒకటికి పది రెట్లు ఎక్కువ. దేశ బడ్జెట్ లో ఇరాన్ డిఫెన్స్ బడ్జెట్ సుమారు 8 బిలియన్ డాలర్లు మాత్రమే ఉంటుంది. 2022, 2023 ప్రకారం మనకు అదే తెలుస్తుంది. అదే ఇజ్రాయెల్ బడ్జెట్ 19 బిలియన్ డాలర్లు. దీన్నిబట్టే చెప్పొచ్చు ఎవరు ఎక్కువగా రక్షణకు ప్రాధాన్యతనిస్తారో?
ఇక ఇరాన్ కి, ఇజ్రాయెల్ కి ఉన్న యుద్ధ విమానాల సంగతేంటో చూస్తే ఇజ్రాయెల్ కు 340 ఉంటే ఇరాన్ దగ్గర 320 మాత్రమే ఉన్నాయి. ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ లో ఎఫ్ 15, 35 రకాలుంటే అదే ఇరాన్ దగ్గర ఎఫ్ 4, 14 రాకాలున్నాయి. ఇవి మరీ ఘోరం. 1960ల కాలం నాటివి. వీటి స్పేర్ పార్ట్స్ కూడా దొరకనంత దైన్యం.
ఇక ఇజ్రాయెల్ ఎంత లేటెస్ట్ అంటే ఈ దేశంలో తయారు చేసిన ఐరన్ డోమ్ టెక్నాలజీని యూఎస్ నేడు గోల్డెన్ డోమ్ గా వాడుకునేంత. అంతే కాదు ఇక్కడ లేజర్ వెపన్ టెక్నాలజీ కూడా తయారైంది. అది ఇతర దేశాల్లో ఉన్న లేజర్ టెక్నాలజీకన్నా మోస్ట్ పవర్ఫుల్. ఇటీవలే వాటిని పరీక్షించి చూసింది ఇజ్రాయెల్. ఇక ఇజ్రాయెల్ ని దెబ్బ తీసే దారేదని చూస్తే.. ఇరాన్ మాన్యువల్.. అదే ఇజ్రాయెల్ టెక్నికల్లీ హై ఎండ్. ఈ దేశం భారీ టెక్నాలజీని కలిగి ఉంటుంది. దీంతో దీన్ని హ్యాండిల్ చేయాలంటే అదే టెక్నాలజీతో నరుక్కు రావల్సి ఉంటుంది. అందుకే ఇజ్రాయెల్ ని దెబ్బ తీయాలంటే సైబర్ దాడులు చేయాలని అంటారు నిపుణులు.
ఇజ్రాయెల్ పై వేలల్లో సైబర్ దాడులు జరుగుతాయి. అదే ఇరాన్ పై కేవలం వందల్లో మాత్రమే. ఉదాహరణకు 2023 అక్టోబర్- డిసెంబర్ మధ్య ఇజ్రాయెల్ మీద 3380 సైబర్ దాడులు జరిగాయి. అదే 2024 ఇరాన్ పార్లమెంటు ఎన్నికల ముందు కేవలం 200 సైబర్ దాడులు మాత్రమే జరిగాయి. ఒక సమయంలో ఇరాన్ మీద సైబర్ దాడుల కారణంగా ఆ దేశంలో పెట్రోలు బంకుల్లో ఇబ్బందులు తలెత్తాయి. వీటన్నిటిని బట్టీ చూస్తే ఇజ్రాయెల్ పై సైబర్ దాడులు ఎక్కువ. ఈ కోణంలో ఇరాన్ ఏదైనా ప్లాన్ చేస్తే ఇజ్రాయెల్ దూకుడును ఇరాన్ కళ్లెం వేయవచ్చంటారు ఎక్స్ పర్ట్స్.
అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇజ్రాయెల్ హీబ్రూ యూనివర్సిటీ ఒక సర్వే ఇర్వహించగా ఇరాన్ పై దాడులు ఎమంత అవసరం లేదనికు మూడింట రెండు వంతుల మంది చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ రాజకీయంగా డౌన్ అయినపుడల్లా ఇరాన్ కార్డు వాడుతారని అంటారు. అందులో భాగంగానే ఈ యుద్ధం తలెత్తినట్టుగా నూ భావిస్తారు. దానికి తోడు యూఎస్ ఉండనే ఉంది. యూఎస్ తన అవసరాల కోసం కూడా ఇలాంటి వార్ టెక్నిక్ ప్లే చేస్తుంటుంది అమెరికా. అందులో భాగంగానే ఈ వార్ నడుస్తున్నట్టుగా ఒక టాక్ వైల్డ్ గా స్ప్రెడ్ అవుతోంది. మరి చూడాలి ఈ యుద్ధం ముగింపు ఎక్కడో.