రాహుల్ గాంధీ నిజంగానే ఓ పప్పు...

 

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై విమర్శలు చేసే వాళ్లకేం కొదవలేదు. ప్రతిపక్ష పార్టీలు ఆయనపై కామెడీగా కామెంట్లు విసురుతుంటారు. ఒక్క ప్రతిపక్ష పార్టీ నేతలే కాదు.. ఈమధ్య సొంత పార్టీ నేతలు కూడా సహనం కోల్పోయి రాహుల్ పై కామెంట్లు విసురుతున్నారు. దానికి పర్యావసానంగా పార్టీ నుండి బహిష్కృతమవుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన వినయ్‌ ప్రధాన్‌ కూడా చేరిపోయాడు. ఈయన రాహుల్ గాంధీని పొగిడే క్రమంలో పప్పు అని సంబోధించి బుక్కయ్యారు. ఇక దీనిపై కాంగ్రెస్ నేతలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నుండి తొలగించారు. దీనిపై స్పందించిన వినయ్‌ ప్రధాన్‌.. రాహుల్‌గాంధీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘నా వైపు వివరణ కూడా తీసుకోకుండా పార్టీ కార్యకలాపాలన్నింటి నుంచి నన్ను తీసేయడం చాలా బాధించింది. కాంగ్రెస్‌ సాధించిన విజయాలు, ఉపాధ్యక్షుడు గొప్పతనాన్ని చెప్పే సమయంలో నేను పప్పు అని రాహుల్‌గాంధీని సంబోధించవలసి వచ్చింది. కానీ అది వాళ్లకి తప్పుగా అనిపించింది. నేను పొగిడినా కూడా అర్థం చేసుకోలేని వ్యక్తి నిజంగానే ఓ పప్పు. ఆయనను అలా పిలిచేందుకు నేను ఏ విధంగాను సంకోచించడం లేదు’ అని వినయ్‌ అన్నారు. రాహుల్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ సీనియర్‌ పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. అందుకే ఆయనకు వ్యతిరేకంగా పప్పు లేని భారత్‌ కావాలి అంటూ ప్రచార కార్యక్రమాన్ని చేపడతానని వినయ్‌ ప్రకటించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu