దుమ్మురేపిన స్టాక్ మార్కెట్లు... సెన్సెక్స్, నిఫ్టీ రికార్డులు
posted on May 10, 2017 4:20PM
.jpg)
స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి. ఈరోజు మార్కెట్ ప్రారంభం నుండే రికార్డ్ స్ఠాయిను దాటిన సెన్సెక్స్, నిఫ్టీ ముగింపు కూడా అదే విధంగా జరిగింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 314.92 పాయింట్లు లాభపడి 30,248.17 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌కు ఇది జీవనకాల గరిష్ఠ రికార్డు. అటు నిఫ్టీ కూడా రికార్డు మార్కువద్దే ముగిసింది. 90.45 పాయింట్లు లాభపడంతో తొలిసారిగా 9,400 మార్క్‌ను దాటింది. మార్కెట్ ముగిసే సమయానికి 9,407.30 వద్ద స్థిరపడింది. దీంతో భారతీ ఎయిర్‌టెల్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, హిందుస్థాన్ యునిలివర్, అరబిందో ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభపడగా.. విప్రో, టాటా పవర్, అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.