రేణుకా చౌదరి భర్త మీద ఎస్సీ, ఎస్టీ కేసు
posted on Mar 26, 2015 10:26AM

కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి భర్త శ్రీధర్‌చౌదరితో పాటు కొంతమంది రేణుక అనుచరుల మీద ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదైంది .బుధవారం టూటౌన్ పోలీసు స్టేషన్‌లో ఈ కేసు నమోదు చేశారు. ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో డాక్టర్ రాంజీ భార్య కళావతి విలేకరులతో మాట్లాడుతుండగా రేణుక చౌదరి భర్త శ్రీధర్ చౌదరి ప్రోత్సహంతో రేణుక చౌదరి అనుచరులు గిరిజన మహిళ అని చూడకుండా తనను కులం పేరుతో దూషింస్తూ, చంపుతామని బెదిరించారని కళావతి తన ఫిర్యాదులో పేర్కోన్నారు. ఆమె పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కళావతి ఇటీవల రేణుకా చౌదరి మీద కూడా ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేశారు. గత ఎన్నికలలో టిక్కెట్టు ఇప్పిస్తానని రేణుకా చౌదరి తన భర్త నుంచి కోటి పది లక్షల రూపాయలు వసూలు చేశారని కళావతి ఆరోపిస్తున్నారు.