తెలంగాణకు అడ్డంకి గవర్నరే : మధుయాష్కీ

హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన అడ్డంకి రాష్ట్ర గవర్నర్  నరసింహన్ అని నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ ఆరోపించారు. అందువల్లే ఆయనను తెలంగాణ ద్రోహిగా పేర్కొంటున్నామని చెప్పుకొచ్చారు.తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇతర కాంగ్రెస్ ఎంపీలతో కలిసి ఆయన  వరంగల్ జిల్లాలోని సమ్మక్కసారలమ్మ దేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గవర్నర్‌ పదవీకాలం పొడిగింపునకు నరసింహన్‌ అనర్హుడన్నారు.గవర్నర్‌ పదవీకాలం పొడిగించవద్దని, ఈ విషయంపై సోనియా, ప్రధానిని కలువనున్నట్టు తెలిపారు. తెలంగాణ కోరుకునే వారు ఐక్యంగా లేనందునే రాష్ట్ర ఏర్పాటులో జాప్యం జరుగుతోందని చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu