మద్యం సిండికేట్లలో బొత్స హాండ్ శోభా

హైదరాబాద్: మద్యం సిండికేట్ల వ్యవహారంలో ప్రధాన ముద్దాయి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణే అని రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు శోభాహైమావతి ఎద్దేవా చేశారు. గాంధీ రాజ్యం తెస్తామన్న కాంగ్రెస్‌ నేతలు బ్రాందీ రాజ్యం తెచ్చారని ఆమె మండిపడ్డారు. దీనిపై ఆమె మాట్లాడుతూ మద్యం సిండికేట్లపై ఏసీబీ దాడులు జరిగిన ప్రతిసారి బొత్స ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. ఏసీబీ దాడుల్లో నిజాయితీ లేదన్నారు. ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు ఈ ఏసీబీ దాడులు జరుగుతున్నాయన్నారు. పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లున్న ఏసీబీ నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రభుత్వాన్ని ఆమె నిలదీశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu