సింగం పోలీస్ ఛేజింగ్‌.. దొంగ‌ల‌ను వెంబ‌డించి పట్టుకున్న ఎస్పీ..

పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు రోల్ మోడ‌ల్‌ సింగం మూవీ. ఛేజింగ్‌లు, ఫైటింగ్‌లతో ఖాకీ డ్రెస్ ప‌వ‌ర్ చూపించిన సినిమా అది. అచ్చం.. ఆ సినిమా త‌ర‌హాలోనే న‌డిరోడ్డుపై ఛేజ్ చేశారు జిల్లా ఎస్పీ. దొంగ‌ల‌ను ప‌ట్టుకునేందుకు.. ధైర్య‌సాహసాలు ప్ర‌ద‌ర్శించారు. ఎస్పీ అంటే చెమ‌ట ప‌ట్ట‌ని ప‌ని.. న‌ల‌గ‌ని డ్రెస్సు.. ఏసీ గ‌దుల‌కే ప‌రిమితం కాద‌ని.. నిరూపిస్తే.. సింగం హీరో త‌ర‌హాలో రోడ్ల‌పై చిరుత‌లా ప‌రుగెత్తారు. పారిపోతున్న దొంగ‌ను ప‌ట్టుకున్నారు. ఇంత‌కీ ఈ సీన్‌.. ఎక్క‌డ‌, ఎలా జ‌రిగిందంటే....  

తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు జిల్లాలో జ‌రిగిందీ ఛేజింగ్‌. ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. టాటూ షాప్ నిర్వ‌హిస్తున్న స‌తీశ్‌ను.. ముగ్గురు దొంగ‌లు కత్తులతో బెదిరించి షాపులో ఉన్న సొమ్ము దోచుకున్నారు. ఆ డ‌బ్బుతో బైక్‌పై పరారయ్యారు. అదే టైమ్‌లో.. అటువైపు వాహనంలో వెళ్తున్న జిల్లా ఎస్పీ సెల్వకుమార్ ఆ దొంగ‌ల‌ను చూశారు. పోలీస్ వెహికిల్‌తో వెంట‌ప‌డ్డారు. 

పోలీసు వాహనాన్ని చూసిన దొంగ‌లు స్పీడ్ పెంచి ప‌రాపోయే ప్ర‌య‌త్నం చేశారు. కానీ, ఓవ‌ర్‌స్పీడ్‌తో బండి కంట్రోల్ చేయ‌లేక అదుపు తప్పి పడిపోయారు. ఒకడు అదే బైక్‌ మీద ఉడాయించగా.. మ‌రో ఇద్దరు దొంగ‌లు పరుగు అందుకున్నారు. అలా పారిపోతున్న దొంగ‌ల‌ను చూసి.. ఎస్పీ సైతం వాహ‌నం దిగి.. వారి వెంట ప‌రుగెత్తాడు. మంచి ఫిట్‌గా ఉన్న ఎస్పీ.. వేగంగా ప‌రుగెత్తి.. ఓ దొంగ‌ను ప‌ట్టుకున్నాడు. తప్పించుకున్న మరో దొంగ‌ను గంటలోపే పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

నిందితుల నుంచి 1,200 నగదు, సెల్‌ఫోన్, కత్తి, కొడవలిని స్వాధీనం చేసుకున్నారు. వెల్లూరు నార్త్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. దొంగ‌లను అరెస్ట్‌ చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్పీతో సహా పోలీసు సిబ్బందిని అంతా అభినందించారు. నిందితులంతా మైనర్లే. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu