ఏపీకి అప్పు ఇవ్వకండి.. మొన్న ఏఐఎంఈడీ, నేడు టీహెచ్‌ఎస్ఏ ‘రెడ్‌ నోటీస్‌’

‘వైద్య రంగంలో విప్లవమే తెచ్చాం’ ... ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సగర్వంగా చేసిన ప్రకటన ఇది. గురువారం రాష్ట్ర శాసన సభలో వైద్య శాఖపై జరిగిన స్వల్పకాలిక చర్చలో పాల్గొన్న ముఖ్యమంత్రి,  చాలా విషయాలు చెప్పారు, అనేక  విజయాలను ఉటంకించారు. అన్నిటినీ మించి ప్రజల ప్రాణాలకు విలువనిచ్చే మనసున్న ప్రభుత్వం తమదని మరో కితాబు తొడిగేసుకున్నారు.  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, వైసీపే ప్రభుత్వం రాష్ట్రంలో వైద్య  సేవలు,సదుపాయాలను ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకు పోయిందో, ముందుముందు ఇంకెంత ముదుకు తీసుకు పోతుందో కూడా వివరించారు.

“ఆరోగ్యశ్రీలో గతంలో 1059 వ్యాధులే కవర్‌ అయ్యేవి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక వాటిని 2466కు పెంచాం. మధ్యతరగతి వారిని కూడా ఈ పథకంలోకి తెచ్చేందుకు ఏడాదికి రూ.5లక్షల ఆదాయం ఉన్నవారికీ ఆరోగ్యశ్రీ కార్డులిచ్చాం. రూ.12లక్షల వరకూ ఖర్చయ్యే వ్యాధులనూ పథకంలోకి తెచ్చాం. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచీ రాష్ట్రంలో 11 బోఽధనాసుపత్రులు ఉంటే, మేం కొత్తగా 18 బోధనాసుపత్రులు నిర్మిస్తున్నాం. ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు, ప్రతి పీహెచ్‌సీలోను ఇద్దరు డాక్టర్లుండేలా విధానం తెస్తున్నాం. ఒక డాక్టరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉంటే ఇంకో డాక్టరు మొబైల్‌ క్లినిక్‌లో ఉంటారు. ఆ డాక్టరు తన పరిధిలోని నాలుగైదు గ్రామాలకు నెలకు నాలుగైదు సార్లు వెళ్లాడు. అంటే అతను బాధితులకు ఒక ఫ్యామిలీ డాక్టర్‌లా ఉంటాడు. దీనికోసం కొత్తగా 462 వాహనాలు కొనుగోలు చేస్తున్నాం. ఇవన్నీ ఆరు నెలల్లో అమల్లోకి వస్తాయి’ అని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చాల గంబీర్ ఉపన్యాసమే చేశారు. ఇంకా చాలా విషయాలు చెప్పారు, ఇందులో ఏది నిజమో ఏది కాదో కానీ, ఇదే వైద్య రంగానికి సంబంధించి ఒక నిండు నిజాన్ని మాత్రం ఆయన చెప్ప లేదు దాచేశారు. 

ఓ పది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్యశాఖకు, ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌కు ఏ కంపెనీ కూడా వైద్య పరికరాలు సరఫరా చేయవద్దు అంటూ వైద్య పరికరాల ఉత్పత్తి దారుల జాతీయ యూనియన్‌ (ఏఐఎంఈడీ) తన అధికారిక వెబ్‌సైట్‌లో ‘రెడ్‌ నోటీస్‌’ జారీ చేసింది. వైద్య పరికరాలు సరఫరా చేసే కంపెనీలు.. ఆంధ్రాతో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆ నోటీసులో గట్టి సూచనలు చేసింది.అంతేకాదు, ఏపీకి అప్పిస్తే అ అప్పు ఇక వసూలు కాదని, మోడ్ని బకాయిలలో చేరిపోతుందని ఒక సున్నిత సూచన చేసింది.  ఇప్పటికే దివాలా అంచులలో ఉన్న రాష్ట్రం చేతులెత్తేస్తే అందుకు ఏఐఎంఈడీ బాధ్యత వహించదని, స్పష్టం చేసింది. ఏఐఎంఈడీ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో, అసలు రాష్ట్ర ప్రభుత్వం బకాయిపడిన అప్పు ఎంతో , రాష్ట్రం పరువును ఇలా దేశం వీద్దుల్లోకి తెచ్చిన ఏఐఎంఈడీ‘రెడ్‌ నోటీస్‌’ఫై తీసుకున్న చర్యలు ఏమిటో  మాత్రం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సభకు తెలియచేయలేదు. ప్రజలతో పంచుకోలేదు. 

అంతే కాదు, ముఖ్యమంత్రి వైద్య రంగంలో విప్లవమే తెచ్చాం’అని గంభీర ఉపన్యాసం దంచుతున్న సమయలోనే, లేదా కొంచెం తతో ఇటుగా, ఏఐఎంఈడీ తరహాలోనే ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లయర్స్ అసోసియేషన్ (టీహెచ్‌ఎ్‌సఏ) కూడా, ఏపీకి ఒక్క పైసా అప్పుకూడా ఇవ్వద్దని, అప్పు  మీద మెడికల్ పరికరాలు, మందులు ఏవీ కూడా సరఫరా చేయవద్దని అసోసియేషన్ సభ్యులను హెచ్చరిస్తూ లేఖ రాసింది. 
ఈఎ్‌సఐకి సంబంధించి రూ.200 కోట్లు బకాయిలున్నాయని... ఇంకెవరూ సరఫరాలు చేయవద్దని సభ్యులకు సూచించింది. నిజానికి... ఈఎ్‌సఐకి కేంద్రం అవసరమైనన్ని నిధులు ప్రతి ఆరు నెలలకు ఒక సారి విడుదల  చేస్తోందని, గడచిన ఆరు మాసాల కాలానికి కూడా రూ.92 కోట్లు విడుదల చేసిందని టీహెచ్‌ఎ్‌సఏ పేర్కొంది. కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించడం వల్లనే ఈఎస్ఐ బకాయిలు, ఏకంగా రూ.200 కోట్ల రూపాయలకు చేరాయని టీహెచ్‌ఎ్‌సఏ లేఖలో పేర్కొంది, నిజానికి, ఇది ఒక్క వైద్య ఆరోగ్య శాఖలో మాత్రమే సాగుతున్న దారి దోపిడి కాదు, జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్రం నుంచి వివిధ పద్దుల కింద వచ్చే నిధులు ఏవీ కూడా సక్రమంగా వినియోగం కావడం లేదనే అభియోగం ప్రజా కోర్టులో వినిపిస్తూనే ఉంది. అలాగే, ఈఎ్‌సఐ ఆస్పత్రులకు మందులు సరఫరా చేసే కంపెనీలకు సక్రమంగా బిల్లులు చెల్లించిన దాఖలాలు లేవు. టీహెచ్‌ఎ్‌సఏ లేఖతో రాష్ట్రంలోని ఈఎ్‌సఐ బకాయిల బాగోతం మొత్తం బయటపడింది. 

టీహెచ్‌ఎ్‌సఏలేఖలో ప్రస్తావించిన అంశాలు అన్నీ నిజమే అయితే, ప్రభుత్వానికే కాదు, రాష్ట్ర ప్రజలకు కూడా చాల అవమానకరం అంటున్నారు, అసోసియేషన్ అధ్యక్షుడు సభ్యులను ఉద్దేశించి రాసిన  లేఖలో.. ‘‘విజయవాడలోని డైరెక్టర్‌ అఫ్‌ ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసె్‌సలో బిల్లులు చెల్లింపు ఇబ్బందిగా ఉంది.మొత్తంగా రూ.200 కోట్లు బకాయిలున్నాయి. ఇలాంటి రిస్క్‌ సమయాల్లో మనం వ్యాపారం చేసుకోలేం. టీహెచ్‌ఎ్‌సఏ సభ్యులందరూ వెంటనే సప్లయ్స్‌ మొత్తం నిలిపివేయండి’’ అని పేర్కొన్నారు.  ఈ అసోసియేషన్‌ సభ్యులు పలుమార్లు ఈఎ్‌సఐ డైరెక్టర్‌ను కలిశారు. డైరెక్టర్‌ కొన్నిసార్లు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో విసుగు చెందిన సరఫరాదారులు కార్మిక శాఖ మంత్రికి, ముఖ్య కార్యదర్శికి, డైరెక్టర్‌కు అనేకసార్లు లేఖలు రాశారు. అయినా ఫలితం లేకపోడంతో.. మందులు, వైద్య పరికరాల సరఫరా నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు... ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం (పీఎంవో) దృష్టికి కూడా తీసుకెళ్లాలని తీర్మానించారు.
అయితే, ఈఎస్ఐ బిల్లులు మొత్తం ప్రాసె్‌సలో పెట్టాం. టీహెచ్‌ఎ్‌సఏ లేఖపై విచారణ చేస్తాం. టీహెచ్‌ఎ్‌సఏలో ఈఎస్ఐ రేటు కాంట్రాక్ట్‌ కుదుర్చుకున్న కంపెనీలు లేవు. ఇలాంటి అసోసియేషన్‌ ఉందన్న విషయం కూడా తెలియదు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని అధికారులు చెపుతున్నారు. ఏది ఏమైనా .. రాష్ట్రంలో వైద్య సదుపాయాలు ఇంట ఘనంగా ఉన్నాయో కొత్తగా చెప్పుకోవలసిన అవసరం లేదు. కొవిడ్ సమయంలో రాష్ట్ర సరిహద్దుల్లో రోగులను ఆపేసిన ఉదంతాలను గుర్తు చేసుకున్నా, తాజాగా గవర్నర్ దంపతులు కొవిడ్ చికిత్సకు హైదరాబాద్ వెళ్ళక తప్పని పరిస్థితి గుర్తు చేసుకున్నా, ఏపీలో వైద్య సదుపాయాలు ఎంత చక్కగా ఉన్నాయో, వేరే చెప్పనక్కర్లేదు అంటున్నారు,

Online Jyotish
Tone Academy
KidsOne Telugu