సోనియా అమెరికా పర్యటన

 

యుపిఎ అధ్యక్షురాలు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాందీ అమెరికా పర్యటనకు వెళుతున్నారు గత కొద్ది రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న ఆమె వైధ్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళుతున్నారు.

2011 ఆగస్టులో అమెరికాలో సోనియాకు శస్త్ర చికిత్స జరిగిన అందుకు సంభందించిన వివరాలను వెల్లడించలేదు. ప్రస్థుత పర్యటన నేపధ్యంలో కూడా వివరాలను వెల్లడించడానికి అధికారులు నిరాకరించారు.

ఆగస్టు 26 న ఆహార భద్రత బిల్లు సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె అర్ధాంతరంగా సభనుంచి వెల్లిపోయారు. అప్పటినుంచి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె పరీక్షల కోసం అమెరికా వెళుతున్నారు. గత ఆరునెలల వ్యవధిలో అమెరికా వెళ్లటం ఇది రెండో సారి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu