సోనియా, రాహుల్ నెత్తి మీద తాటికాయ పడిందా..!

 

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. బీజీపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ వేయగా దీనిపై కోర్టులో విచారణలు జరుగుతూనే ఉన్నాయి. యంగ్‌ ఇండియా కంపెనీకి సోనియా, రాహుల్‌కు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారని... కాంగ్రెస్‌ పార్టీ నిధుల నుంచి రూ.90కోట్లను అసోసియేటెడ్‌ జర్నల్స్‌కు రుణంగా ఇచ్చిందని... వాటిని తిరిగి తీసుకునే హక్కును యంగ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రూ.50లక్షలకు అప్పగించిందని... దీంతో పార్టీ నిధులను పక్కదారి పట్టించారని ఆరోపిస్తూ స్వామి న్యాయస్థానంలో కేసు దాఖలు చేశారు. అయితే ఈసారి విచారణలో మాత్రం వారికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో వారిద్దరినీ ఆదాయపు పన్ను శాఖ అధికారులు విచారించేందుకు దిల్లీ హైకోర్టు అనుమతినిస్తూ  ఆదేశాలు జారీ చేసింది. దీంతో కోర్టు నిర్ణయంపై స్వామి హర్షం వ్యక్తం చేశారు. కాగా ఇప్పటికే ఈ కేసులో భాగంగా మాజీ నేవీ చీఫ్ మార్షల్ ఎస్.పి త్యాగి విచారణను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు సోనియా, రాహుల్‌ ను కూడా విచారించేందుకు గ్రీని సిగ్నల్ వచ్చింది. మొత్తానికి మూలిగే నక్క మీద తాటికాయ పడట్టు అన్న సామెత ప్రకారం.. ఇప్పటికే కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ కు ఇప్పుడు ఈ కేసు ద్వారా మరో చిక్కు ఎదురైంది. మరి ఈ నేపథ్యంలో సోనియా, రాహుల్ ఏం చేస్తారో చూద్దాం..

Online Jyotish
Tone Academy
KidsOne Telugu