ట్రంప్ పై ఒబామా ఫైర్.. ఇదేమన్న రియాలిటీ షో అనుకున్నావా..?
posted on May 7, 2016 12:44PM
.jpg)
అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో దిట్ట. సంచలన వ్యాఖ్యలు చేస్తూ విమర్శలపాలవుతాడు. అయితే ఇప్పుడు ట్రంప్ పై అమెరికా అధ్యక్షుడు ఒబామా విరుచుకుపడ్డారు. వాషింగ్టన్ లో ఆయన మాట్లాడుతూ, వైట్ హౌస్ లో అడుగుపెట్టడం అంటే రియాలిటీషోలో పాల్గొనడం అనుకుంటున్నావా? అని నిలదీశారు. అధ్యక్ష పదవి అంటే వినోదమని ట్రంప్ భావిస్తున్నాడని ఆయన మండిపడ్డారు. ముస్లింలను దేశంలోకి అనుమతించనంటూ వ్యాఖ్యలు చేస్తున్న ట్రంప్ అధ్యక్ష పదవికి అర్హుడా? అని ఆయన ప్రశ్నించారు. ఉన్నత పదవిని సీరియస్ గా తీసుకునే వ్యక్తినే అది వరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. రిపబ్లికన్ పార్టీ ఇప్పటికైనా తాము ఎవరిని అధ్యక్ష అభ్యర్థిగా ఎంచుకోబోతున్నామో తెలుసుకోవాలని ఆయన హెచ్చరించారు. రిపబ్లికన్ పార్టీకి ఓటు వేయాలనుకునేవారు ట్రంప్ అమెరికాను ఏ విధంగా చేయాలనుకుంటున్నాడో ఆలోచించి ఓటు వేయాలని ఆయన సూచించారు.