సోనియా ఆస్తుల గుట్టు

 

తనకు కేవలం కోటి ముప్పై ఎనిమిది లక్షల రూపాయల ఆస్తి మాత్రమే ఉందన్న సోనియా గాంధీకి హఫింగ్టన్‌ పోస్ట్‌ షాక్‌ ఇచ్చింది.. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఆస్తుల విలువ 12 వేల కోట్ల పై మాటే అని హఫింగ్టన్‌ పోస్ట్‌ వెల్లడించింది. ప్రపంచంలో అత్యధిక ధనవంతులైన రాజకీయ నేతల జాబితాలో ఆమె 12వ స్థానంలో ఉన్నారు.

ఈ లిస్ట్‌లో 50 బిలియన్ల ఆస్తితో  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానాల్లో థాయ్‌లాండ్‌ రాజు భుమిబోల్‌ అదుల్యాదెజ్‌, బ్రూనై సుల్తాన్‌ హసనల్‌ ఉన్నారు. అయితే బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ ఆస్తుల విలువ మాత్రం ఐదొందల మిలియన్‌ డాలర్లు మాత్రమే.

ఇదిలా ఉండగా 2009లో సోనియా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తనకు 1.38 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నట్లుగా తెలిపిన సోనియా,  ఆమెకు సొంత వాహనం కానీ, సొంత ఇల్లు కానీ లేదని వెల్లడించారు. 75 వేల నగదు, బ్యాంక్‌ డిపాజిట్ల రూపంలో 28 లక్షలా 61 వేల రూపాయలున్నాయని ప్రకటించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu