సోనియా ఆశీస్సులతోనే సభ?!
posted on Oct 26, 2013 3:21PM
.jpg)
సోనియాగాంధీ ఆశీస్సులతోనే జగన్ హైదరాబాద్‌లో సమైక్య శంఖారావ సభ నిర్వహించాడని అటు తెలుగుదేశం నాయకులతోపాటు ఇటు కాంగ్రెస్ నాయకుడు జేసీ దివాకర్‌రెడ్డి వేరువేరుగా విమర్శించారు. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకని అధికారం కోసం పాకులాడిన జగన్.. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు వర్షాల ధాటికి జన, ప్రాణ, పంట, ఆస్తి నష్టంతో బాధపడుతుంటే జన సమీకరణలో మునిగాడని తెలుగుదేశం నాయకులు ముద్దు కృష్ణమనాయుడు ఆరోపించారు. సోనియా గాంధీ దర్శకత్వంలోనే జగన్ సభ జరుగుతోందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కుమ్మక్కు కావడం వల్లే జగన్ సభ సజావుగా జరుగుతోందని ముద్దు కృష్ణమనాయుడు ఆరోపించారు. తెలుగుదేశం నాయకుల విమర్శలు ఇలా వుంటే, జగన్ సభని, కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నాయకుడు జె.సి.దివాకరరెడ్డి కడిగిపారేశారు. కాంగ్రెస్ పార్టీ జగన్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని, అందుకే సీబీఐ జగన్‌కి క్లీన్‌చిట్ ఇచ్చిందని చెప్పారు.