జగన్ పై జెసి సంచలనం
posted on Oct 26, 2013 3:48PM

కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిక్సింగ్ చేసుకున్నారు. దీనికి 144 కారణాలున్నాయి. ఇందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. జగన్ కు బెయిలు దక్కడమే ఇందుకు సాక్ష్యం. జగన్ కు బెయిలు రావడంలో ఎలాంటి తప్పు లేదని, అయితే ఆయనకు సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వడమే తప్పు అని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ కేసు విచారణలో ఏం తేలిందని సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అండదండల మూలంగానే హైదరాబాద్ లో జగన్ సభ విజయవంతం అవుతుందని, ఇతర ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు ఆపి జగన్ సభ కొరకు 14 రైళ్లను మళ్లించారని జేసీ ఆరోపించారు. ఢిల్లీలో అధికారం కోసం కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంలో పార్టీని నాశనం చేసిందని, సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగయినట్లేనని ఆయన అన్నారు. విభజనకు వ్యతిరేకంగా ప్రధానికి, రాష్ట్రపతికి లేఖలు రాసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనకు ధైర్యాన్ని నిరూపించుకున్నారని జేసీ ప్రశంసించారు.