ఏపీ లిక్కర్ కేసు.. విదేశాల్లో కీలక నిందితులు.. రెడ్ కార్నర్ నోటీసులు?

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో సిట్ దూకుడును మరింత పెంచింది. ఈ కేసులో నిందితులు అయిన ఎనిమిది మంది విదేశాలలో ఉన్నట్లు గుర్తించిన సిట్ వారిని స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవడానికి రెడీ అయ్యింది. విదేశాలలో తలదాచుకున్న నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని భావిస్తోంది. ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసుందుకు రంగం సింద్ధం చేసింది.

ఈ కేసులో కీలకంగా ఉన్న ఎనిమిది మంది నిందితులు దుబాయ్, ధాయ్ ల్యాండ్ లో ఉన్నట్లు గుర్తించింది. వీరిలో కిరణ్, సైఫ్ అహ్మద్, వరుణ్, శివకుమార్. సైమన్ ప్రసన్న, ప్రద్యుమ్నలు దుబాయ్ లోనూ, ఇక అవినాష్ , అనిరుధ్ రెడ్డిలు ధాయ్ ల్యాండ్ లోనూ ఉన్నట్లు గుర్తించింది. వీరిలో ధాయ్ ల్యాండ్ కు పారిపోయిన అవినాష్, అనిరుథ్ రెడ్డిలు వారిపై కేసు నమోదు అయిన తరువాత పరారీ అయ్యారు. ఈ ఎనిమిది మందిని భారత్ కు రప్పించేందుకు సిట్ చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే  విదేశాంగ శాఖకు సిట్ అధికారులు సమాచారమిచ్చారు.  దుబాయ్, థాయ్ ల్యాండ్ కు పరారైన ఈ నిందితులను భారత్ కు ఆయా దేశాలతో ఉన్న మ్యూచువల్ లీగల్ ట్రీటీస్ ద్వారా భారత్ కు రప్పించేందుకు చర్యలు తీసుకోవలసిందిగా విదేశాంగ శాఖకు సిట్ అధికారులు లేఖ రాశారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu