సింగరేణి వారసత్వ ఉద్యోగాలు గ్రీన్ సిగ్నల్..

 

గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సింగరేణి ఉద్యోగుల విషయంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్సీసీఎల్) సంచలన నిర్ణయం తీసుకుంది.  సింగరేణి బోర్డు  నుంచి ఆఫ్‌ డైరెక్టర్స్‌ సమావేశంలోవారసత్వ ఉద్యోగాలు పొందేందుకుగల అర్హతలు, ఇతర బెనిఫిట్స్‌పై కీలకనిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సింగరేణి భవన్‌లో సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాలమేరకు సింగరేణి కాలరీస్ కంపెనీలో వారసత్వ ఉద్యోగాలకు అంగీకారం తెలిపామని, ఎంతోకాలంగా కార్మికులు కోరుతోన్న ఈ అంశంపై శుక్రవారం జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం..

* సింగరేణిలో ప్రస్తుతం పనిచేస్తోన్న కార్మికుల్లో దసరాకు, అంటే 2016 అక్టోబర్ 11 నాటికి 48 నుంచి 59 సంవత్సరాల వయసు మధ్య గలవారు ఈ వారసత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
* ఉద్యోగికి సంబంధించి కొడుకు లేదా అల్లుడు లేదా తమ్ముడు వారసత్వ ఉద్యోగం పొందేందుకు అర్హులు. వారి వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.