ఏపీలో పెట్టుబడులు పెట్టాలని మైక్రోసాప్ట్‌కు లోకేశ్ విజ్ఞప్తి
posted on Jul 30, 2025 4:45PM

సింగపూర్ పర్యటనలో నాలుగో రోజు మంత్రి నారా లోకేశ్ బృందం సెసిల్ స్ట్రీట్ లోని మైక్రోసాఫ్ట్ ఎక్స్ పీరియన్స్ సెంటర్‌ను సందర్శించారు. అక్కడ ఏఐ గోస్టోర్ లోని వివిధ పరిశ్రమలు, ఆరోగ్య సంరక్షణ, ఎఫ్ఎస్ఐ, తయారీ, వినియోగదారు పరిశ్రమల్లో ఏఐ వినియోగ దృశ్యాలను పరిశీలించారు. అనంతరం మైక్రోసాఫ్ట్ గవర్నమెంట్ ఎఫైర్స్ హెడ్ మార్కస్ లోహ్, సెలా హెడ్ జాస్మిన్ బేగం, సిటిఓ మార్క్ సౌజాలతో భేటీ అయ్యాను. ఏపీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్ పీరియన్స్ జోన్ టెక్నాలజీ స్టేషన్ ను ఏర్పాటు చేయాలని వారు కోరారు.
అమరావతి క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్‌లో అజూర్ ఓపెన్ ఏఐ సర్వీస్, మైక్రోసాఫ్ట్ కోపైలట్‌ను ఉపయోగించి పరిష్కారాలను అన్వేషించడానికి మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఆధ్వర్యాన 2026లో హ్యాకథాన్‌ను నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి తమ ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పిస్తుందని హామీ ఇచ్చారు. అజూర్ ఓపెన్ AI మెక్రోసాప్ట్‌ను ఉపయోగించి 2026లో హ్యాకథాన్ నిర్వహించాలని కోరారు