సమంతతోనే సిద్ధార్థ్ పెళ్ళి?
posted on Mar 27, 2013 12:10PM

హీరో సిద్ధార్థ్ పెళ్ళికి రెడీ అయ్యాడు. ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో నేను పెళ్ళికి రెడీ అని ప్రకటించేశాడు. కాని ఆ అమ్మాయి ఎవరో చెప్పలేదు. ఆ మధ్య రంగ్ దే బసంతి' చేసే కాలంలో సైఫ్ అలీఖాన్ చెల్లెలు సోహా అలీఖాన్‌తో డేటింగ్ చేస్తున్నాడని, పెళ్ళి కూడా చేసుకుంటారని వార్తలొచ్చాయి. మరి ఎందుకో ఆ కధ పెళ్ళి వరకు రాకుండానే కంచికి చేరింది.

తెలుగులో 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' సినిమా చేసేప్పుడు ఆ సినిమా హీరోయిన్ తమన్నాకీ, ఆయనకీ మధ్య 'సమ్‌థింగ్' నడుస్తోందంటూ ఊహాగానాలు చెలరేగాయి. ఇటీవల కొంత కాలంగా సిద్ధార్ద్ ..సమంతాలు ప్రేమలో మునిగి తేలుతున్నారని ఫిల్మ్ నగర్ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరోవైపు సమంత, సిద్దార్ద్ లు కలిసి గుళ్ళుగోపురాల వెంట తిరిగి పూజలు చేయడం ఈ వార్తలకు బలం చేకూర్చాయి.
మరోవైపు సమంత కూడా తాను ప్రేమలో పడ్డానని, టైం వచ్చినప్పుడు తన లవర్ వివరాలు వెల్లడిస్తానని చెబుతోంది. ఇవన్ని చూస్తుంటే సిద్దార్ద్, సమంత ఒకటవ్వడం ఖాయమని జనాలు గుసగుసలాడుకుంటున్నారు.