ప్రముఖ నటి సుకుమారి కన్నుమూత
posted on Mar 27, 2013 2:21PM
.jpg)
మురారి చిత్రంలో మహేష్ బాబు బామ్మ శబరి పాత్రలో నటించిన సుకుమారి (74) మంగళవారం చెన్నైలో కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం ఇంటి పూజగదిలో దీపం వెలిగిస్తుండగా చీరకు నిప్పంటుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న ఆమె నిన్న తుది శ్వాస విడిచారు. సుకుమారి కి ఓ కుమారుడు డాక్టర్ సురేష్ ఉన్నారు. తమిళ,తెలుగు, హిందీ, మాలయళీ, ఒరియా, బెంగాలీ బాషల్లో రెండు వేలకు పైగా చిత్రాలలో నటించారు.
తెలుగులో నాగార్జున నిర్ణయం, మహేష్ మురారి, పల్లెటూరి బావ చిత్రాలలో నటించిన ఆమెకు 'కుదిరితే కప్పు కాఫీ' చివరి తెలుగు చిత్రం. 2003లో పద్మశ్రీ పురస్కారం పొందారు. తమిళ మళయాళ బాషల్లో విడుదలైన 'నమ్మగ్రామం' చిత్రానికి గాను 2011లో ఉత్తమ సహాయనటిగా జాతీయ పురస్కారం అందుకున్నారు.