రామ్ చరణ్ తుఫాన్ ట్రైలర్ పై అమితాబ్ స్పందన
posted on Mar 26, 2013 5:56PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ 'జంజీర్' తెలుగులో 'తుఫాన్' గా వస్తుంది. ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను నిన్న హైదరాబాద్ లో కేంద్రమంత్రి, మెగా స్టార్ చిరంజీవి విడుదల చేశారు. తాజాగా ఈ ట్రైలర్ పై బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ స్పందించారు.
'జంజీర్' సినిమా రికార్డ్ లు క్రియేట్ చేయడం ఖాయమని అన్నారు. జంజీర్ ట్రైలర్ ను చూశానని, చాలా పవర్ ఫుల్ గా వుందని..సినిమా టీంకు నా అభినందనలు' అంటూ అమితాబ్ తన బ్లాగులో పేర్కొన్నారు. 1973లో అమితాబ్ బచ్చన్ హీరోగా చేసిన సూపర్ హిట్ ‘జంజీర్'ను రామ్ చరణ్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ గెస్ట్ రోల్ చేయడం విశేషం.
తుఫాన్ లో ఎసిపి పాత్రలో చరణ్ కనిపించనున్నారు. అపూర్వ లిఖియా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీలో సంజయ్ దత్ చేస్తున్న షేర్ ఖాన్ పాత్రని తెలుగులో శ్రీహరి చేస్తున్నారు.