శ్వేతాబసు మంచిపిల్ల.. కోర్టు..
posted on Dec 6, 2014 1:53PM

సినీనటి శ్వేతాబసు ప్రసాద్ వ్యభిచారానికి పాల్పడుతోందంటూ హైదరాబాద్ పోలీసులు హడావిడి చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంలో నాంపల్లి కోర్టు శ్వేతా బసు ప్రసాద్‌కి క్లీన్ చిట్ ఇచ్చింది. ఆమెపై వున్న అభియోగాలను కొట్టివేసింది. ఎర్రమంజిల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ శ్వేతా బసు ప్రసాద్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనను పోలీసులే కావాలని ఇరికించారని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. నాంపల్లి కోర్టు ముందు కూడా ఆమె ఇదే వాదనని వినిపించారు. తాను ఒక ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొనడానికి ఆ హోటల్‌కి వెళ్ళానని, తాను ఎలాంటి తప్పూ చేయలేదని శ్వేత బసు పేర్కొంది. శ్వేతా బసు వాదనతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు ఆమెపై పోలీసులు నమోదు చేసిన అభియోగాలను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు తీర్పు పట్ల నటి శ్వేతాబసు ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు కోసమే ఇంతకాలంగా వేచి చూశానని ఆమె అన్నారు.