ముగ్గురు రైతుల ఆత్మహత్య..
posted on Dec 6, 2014 2:05PM

తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం, శనివారం ముగ్గురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొత్తల్లపల్లి గ్రామానికి చెందిన అణగోని లక్ష్మయ్య (65) అనే రైతు అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గత రెండేళ్ళుగా పంట దిగుబడి సరిగా రాకపోవడంతో లక్ష్మయ్య రెండు లక్షల అప్పు పాలయ్యాడు. దాంతో మనస్తాపానికి గురైన లక్ష్మయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా లోకేశ్వరం మండలం పిప్రి గ్రామానికి చెందిన నర్సయ్య అనే రైతు అప్పుల బాధ భరించలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లలో మైసయ్య అనే రైతు అప్పుల బాధ భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.