శుభమన్ గిల్ సెంచరీ.. మూడో టి20లో ఇండియా ఘన విజయం

న్యూజిలాండ్ తో అహ్మదాబాద్ లో బుధవారం (ఫిబ్రవరి 1) జరిగిన నిర్ణయాత్మకమైన ఆఖరి టీ20లో టీమిండియా ఆకాశమే హద్దుగా చెలరేగి ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఆటలోని అన్ని విభాగాల్లోనూ పై చేయి సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. రెండో ఓవర్ లోనే ఇషాంత్ కిషన్ ఔటైనప్పటికీ శుభమన్ గిల్ అద్భుత బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు.  

కేవలం 54 బంతుల్లో సెంచరీ సాధించాడు.  గిల్. మొత్తంగా 63 బంతుల్లో 126 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ స్కోరులో 12  ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో టి20లో ఇండియా తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. అంతకు ముందు ఈ రికార్డు కోహ్లీ పేరిట ఉంది.  అలాగే రాహుల్ త్రిపాఠి 22 బంతుల్లో 3 సిక్సర్లు, 4 ఫోర్లతో 44 పరుగులు చేశాడు.  

235 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఏ దశలోనూ నిలదొక్కుకోలేకపోయింది. భారత బౌలర్ల ధాటికి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ  12.1 ఓవర్లలో 66 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో న్యూజిలాండ్ పై టీమ్ ఇండియా 168 పరుగుల భారీ విజయం సాధించింది.

భారత బౌలర్లలో హార్థిక్ పాండ్యా నాలుగు వికెట్లు, హర్షదీప్, ఉమ్రాన్, మావీలు రెండేసి వికెట్లు తీశారు. శుభమన్ గిల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ విజయంతో మూడు టి20ల సిరీస్ ను టీమ్ ఇండియా 2-1తో కైవశం  చేసుకుంది. స్కిప్పర్ హార్థిక్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu