నేనంటే ఏంటో చూపిస్తా...
posted on May 24, 2017 12:03PM
.jpg)
కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి నారాయణరెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యపై ఇప్పటికే వైసీపీ నేతలు ఏపీ ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తున్న సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు ఈ హత్యపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతల్లో క్రమశిక్షణారాహిత్యం పెరిగిపోయిందని..ఇకపై నేనంటే ఏంటో చూపిస్తానని అన్నారు. ఈ రోజు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు ఫ్యాక్షన్ హత్యలు సహజమని, ఎవరో ఎవరినో పాత పగల నేపథ్యంలో హత్య చేస్తే, ప్రభుత్వంపై అభాండాలు వేయడం సమంజసం కాదని అన్నారు. అంతేకాదు.. ప్రకాశం ఘటనపై కమిటీని వేస్తున్నట్టు ప్రకటించారు. కమిటీ నివేదిక వచ్చిన తరువాత తప్పు చేసిన వారిపై చర్యలుంటాయని స్పష్టం చేశారు.