తమిళంలో డిజిటలైజ్ శంకరాభరణం...!

 

"శంకరా... నాద శరీరాపర... "అనే ఈ పాట ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అలరిస్తూనే ఉంది. కె.విశ్వనాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ "శంకరాభరణం" చిత్రం త్వరలోనే తమిళంలోకి డబ్బింగ్ అవబోతుంది. ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం విడుదలై 34 సంవత్సరాలు అవుతుంది. ఈ చిత్రాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటలైజ్ చేసి, 5.1 సౌండ్ సిస్టం హంగులతో, సినిమా స్కోప్ లోకి మర్చి, తమిళంలో విడుదల చేయబోతున్నారు. అయితే ఈ చిత్రం తెలుగు వర్షన్ తమిళనాట విడుదలై అప్పట్లోనే సిల్వర్ జూబ్లీ ఆడింది. మరి ఈసారి ఏకంగా తమిళ వర్షన్ లోనే విడుదల కాబోతుంది. మరి ఇపుడు ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu