నయన్ వద్దు...కొత్తమ్మాయే ముద్దు...!

 

మారుతి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా "రాధ" అనే చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ చిత్రంలో వెంకీ సరసన నయనతార హీరోయిన్ గా నటించబోతుందని గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇదే విషయం గురించి దర్శకుడు మారుతి మాట్లాడుతూ... "రాధ"కోసం నయనతారను అసలు కలవలేదు మేము. మేము ఒక కొత్త హీరోయిన్ కోసం చూస్తున్నాం. వెంకటేష్-నయన్ ల కాంబినేషన్ మనం ఇదివరకే రెండు సినిమాలలో చూసేసాం కదా! అందుకే ఈసారి ఒక కొత్త అమ్మాయి కోసం చూస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ ఫిబ్రవరి 2014లో మొదలు పెడతాము అని అన్నారు. మారుతి ప్రస్తుతం "కొత్తజంట" షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu